కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జి గోడను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అనంతపురం జిల్లా హిందూపురం వాసులు స్పాట్లోనే మృతి చెందారు. మృతులు నాగభూషణ్, నాగరాజు, మురళి, సోమగా గర్తించారు. కర్ణాటక యాద్గిర్ జిల్లా షహార్ పూర్ సంతలో గొర్రెలను కొనుగోలు చేసేందుకు వెళ్లారు.
రాయ్ చూర్ జిల్లా గబ్బురు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమర్పురాలో వీరు ప్రయాణిస్తున్న వాహనం బ్రిడ్జిని ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించారు. ఈ ఘటనతో బ్రిడ్జిపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ ని పునరుద్ధరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.