విడాకులు తీసుకున్న నటితో రెండో పెళ్లికి సిద్ధమైన ధనుష్ ..!

-

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని ఇటీవల సార్ చిత్రంతో తెలుగులో కూడా భారీ విజయాన్ని దక్కించుకున్న ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇదిలా ఉండగా కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పుడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ను వివాహం చేసుకున్న ఇద్దరు కొడుకులు జన్మించిన తర్వాత దాదాపు 18 సంవత్సరాలు వైవాహిక బంధంలో కొనసాగి.. ఇటీవల విడాకులు తీసుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే.

కొడుకులు ఉండగానే హీరోయిన్లతో సన్నిహితంగా ఉండే విషయంలో ప్రతిసారి ఐశ్వర్య ధనుష్ తో గొడవ పెట్టుకునేదట. అలా కొన్ని రోజుల తర్వాత కొడుకుల కోసం ధనుష్ ని భరించిన ఆమె ఆ తర్వాత అతడు చేసే పనులు నచ్చక విడాకులు ఇచ్చినట్టు ఇప్పటికే రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న మరొక విషయం ఏమిటంటే.. ధనుష్ గత కొద్ది రోజులుగా ఒక హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నారని.. అంతే కాదు ఆ హీరోయిన్ తో డేటింగ్ కూడా చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

అయితే ఆ హీరోయిన్ కి అప్పటికే పెళ్లి జరిగి విడాకులు కూడా అయ్యాయని ఆమెతో ఇప్పుడు ధనుష్ తిరుగుతున్నాడు అని సమాచారం. ఇక కోలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం విడాకులైన ఆ హీరోయిన్ ని ధనుష్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు డిసెంబర్లో సింపుల్ గా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం ధనుష్ కి సంబంధించిన ఈ వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news