జైల్లో బాబు: పోలిటికల్ మైలేజ్‌పై చర్చ.!

-

మొత్తానికి టి‌డి‌పి అధినేత చంద్రబాబు జైలు జీవితం గడిపే సమయం వచ్చింది. ఎప్పుడో బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రకు వెళ్ళి వారం రోజుల పాటు జైలు పాలయ్యారు. కానీ అది పోరాటం విషయంలో అది పక్కన పెడితే..40 ఏళ్ల జీవితంలో అవినీతి విషయంలో ఎప్పుడు జైలుకెళ్లలేదు. అనేక కేసులు ఉన్నా సరే బాబు జైలుకు వెళ్ళిన సందర్భం లేదు.

మొదట సారి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బాబుకు రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు రిమాండ్ కొనసాగనుంది. ఈ మధ్యలో బెయిల్ వస్తుందా? ఏం జరుగుతుందా? అనేది పక్కన పెడితే..మొత్తానికి బాబు మాత్రం జైలుకెళ్లారు. అదే ఇప్పుడు వైసీపీ నేతలు, శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. జగన్‌ని అక్రమంగా 16 నెలల పాటు జైల్లో పెట్టారని, ఇప్పుడు బాబుకు జైలు జీవితం అర్ధం అవుతుందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. బాబుని జైల్లో పెట్టడం ఎవరి వల్ల కాదని, కానీ జగన్ వల్ల సాధ్యమైందని చెబుతున్నారు.

Chandrababu

ఇటు టి‌డి‌పి శ్రేణులు, నేతలు నిరాశలో ఉన్నారు. కొందరు ఆవేదనకు గురి అవుతున్నారు.  బాబుని కక్షపూరితంగా అరెస్ట్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. అటు జనసేన సైతం టి‌డి‌పికి మద్ధతుగా నిలుస్తుంది. పరిణామాలు ఎలా ఉన్నా..ఈ అరెస్ట్ అంశం టి‌డి‌పికి కలిసొస్తుందా? లేక వైసీపీకి ప్లస్ అవుతుందా? అనే చర్చ నడుస్తోంది.

జగన్ అరెస్ట్ అయినప్పుడు సానుభూతి వచ్చి 2012 ఉపఎన్నికలో ప్లస్ అయింది. కానీ 2014 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. ఇప్పుడు మరో 8 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో బాబుని అరెస్ట్ చేసి జగన్ ప్రభుత్వం సాహసం చేసిందనే చెప్పాలి. కానీ అన్నీ ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేసి ఉంటుందని, అలా కాకుండా అక్రమంగా అరెస్ట్ అంటే బాబుపై సానుభూతి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

ఆధారాలు ఉన్నాయి కాబట్టే 14 రోజులు రిమాండ్ విధించారని, లేదంటే రిమాండ్ కోర్టు తిరస్కరించేది అని చెబుతున్నారు. కాబట్టి పక్కగా అవినీతి చేశారు కాబట్టే జైలు శిక్ష అనుభవిస్తున్నారని ప్రజలు భావించే అవకాశాలు ఉన్నాయని, ఎట్టి పరిస్తితుల్లోనూ ఈ అరెస్ట్ వల్ల బాబుపై సానుభూతి పెద్దగా రాదని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news