ఎడిట్ నోట్: బాబు ‘రిమాండ్’..కౌంట్‌డౌన్ షురూ.!

-

ఇంతకాలం ఏపీ రాజకీయాలు ఒక ఎత్తు..ఈ రెండు రోజులు మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ఎంత ఉత్కంఠ మధ్య, హోరాహోరీ వాదనలు మధ్య..ఏసీబీ కోర్టు టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించడం సంచలనం సృష్టించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏ 37గా బాబుని అదుపులోకి తీసుకున్న ఏపీ సి‌ఐ‌డి పోలీసులు..అనేక ట్విస్ట్‌లు మధ్య కోర్టులో ప్రవేశపెట్టగా, 6 గంటల పాటు ఇరుపక్షాల వాదన తర్వాత  చంద్రబాబును 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

చంద్రబాబు కాన్వాయ్‌ అర్ధరాత్రి 1.10 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుంది. చంద్రబాబుకు రిమాండ్‌ ఖైదీ నెంబరు 7691 కేటాయించారు. సెంట్రల్‌ జైలులోని ‘స్నేహ’ బ్లాక్‌ను చంద్రబాబు కోసం కేటాయించారు. మొత్తానికి బాబు అరెస్ట్ జరిగింది. ఇప్పుడు బెయిల్ కోసం బాబు అప్పీల్ చేసుకున్నారు. అలాగే హౌస్ అరెస్ట్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై ఎలాంటి తీర్పు వస్తుందనేది ఉత్కంఠగా మారింది.

TDP

ఇక మొత్తానికి బాబు అరెస్ట్ పై రకరకాల వాదనలు వస్తున్నాయి. కేవలం కక్షపూరితంగానే బాబుని అరెస్ట్ చేశారని టి‌డి‌పి నేతలు, శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. అటు బాబు అరెస్టుపై పవన్ సైతం మండిపడ్డారు. జగన్ సైకో పాత్ మాదిరిగా ఉన్నారని చెబుతూ..టి‌డి‌పికి మద్ధతు పలికారు. అయితే బాబు అరెస్ట్ రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది పెద్ద చర్చ నడుస్తోంది.

ఇది ఖచ్చితంగా వైసీపీకి యాంటీ అవుతుందని, బాబుపై సానుభూతి వస్తుందని కొందరు అంటుంటే..లేదు లేదు బాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారని, తప్పు చేసిన వారికి ప్రజా మద్ధతు ఉండదని మరికొందరు అంటున్నారు. ఇలా బాబు అరెస్ట్ పై రకరకాల అంశాలు ప్రచారం అవుతున్నాయి. ఏది ఎలా జరిగిన ఇక్కడ నుంచి ఏపీ రాజకీయం మంచి రసవత్తరంగా కొనసాగుతుందని చెప్పవచ్చు.

ఇక్కడ నుంచి అసలు ఆట మొదలవుతుంది. ఈ అంశం రాజకీయంగా ఎవరికి ప్లస్ అవుతుంది..ఎవరికి మైనస్ అవుతుందనేది చూడాలి..ఇంకా పోలిటికల్ కౌంట్ డౌన్ షురూ.

Read more RELATED
Recommended to you

Latest news