మనం చాలా ఇంట్రెస్టింగ్గా ఓ సినిమా చూస్తున్నాం.. సూపర్ ఫైట్స్.. పవర్ ఫుల్ డైలాగ్స్.. అదిరిపోయే ట్విస్టులు.. చాలా ఆసక్తిగా ఉంది సినిమా. కరెక్ట్‌గా హీరో విలన్‌కు వార్నింగ్ ఇస్తున్నాడు.. ఆ సీన్లో ఓ పవర్ ఫుల్ డైలాగ్ వస్తోంది. కానీ అది మనకు సరిగ్గా వినిపించడం లేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ డైలాగ్‌ను డామినేట్ చేస్తోంది. ఇలాంటి సమస్యను మీరూ ఎదుర్కొన్నారు కదూ. అయితే ఇలాంటి ప్రాబ్లెమ్స్‌కు అమెజాన్ ప్రైమ్ చెక్ పెట్టింది.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌ప్రైమ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. డైలాగులు స్పష్టంగా వినిపించేలా డైలాగ్ బూస్ట్ సదుపాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ యూజర్ల కోసం తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ ‘డైలాగ్ బూస్ట్’ పేరుతో తీసుకొస్తున్న కొత్త ఫీచర్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంభాషణలను మరింత స్పష్టంగా వినొచ్చు. ఈ ఫీచర్ కోసం వీడియో మెనూ బార్‌లో ఉన్న ‘audio and subtitles’పై క్లిక్ చేయాలి. అందులో మీడియం, హై అనే ఆప్షన్స్‌ను ఎంచుకోవచ్చు. మీ సౌకర్యాన్ని బట్టి ఏది కావాలంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.