అతనితో ఎఫైర్ వల్లే కళ్యాణి తన భర్తకు విడాకులు ఇచ్చిందా..?

-

ప్రముఖ సీనియర్ హీరోయిన్ కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే డైరెక్టర్ సూర్య కిరణ్ ను వివాహం చేసుకుంది. అయితే కొద్ది రోజులకే అతడితో విడాకులు తీసుకుని దూరమయింది. ఇక ఈ విషయం ఈ మధ్యకాలంలో చాలా వైరల్ గా మారుతోంది. అయితే వీరిద్దరి విడాకులపై ఇప్పటికే ఎన్నోసార్లు డైరెక్టర్ సూర్యకిరణ్ చెల్లెలు ప్రముఖ నటి సుజిత ఎన్నోసార్లు వెల్లడించినప్పటికీ కూడా ఈ విషయం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే వుంది.

ఇకపోతే తాజాగా అప్పట్లో వీరి విడాకులకు మరొక స్టార్ హీరో కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో కళ్యాణి విడాకులు తీసుకున్నప్పుడు ఒక స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే సూర్య కిరణ్ కి, కళ్యాణికి మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చింది అంటూ వార్తలు బలంగా వినిపించాయి. ఇక ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయాన్ని తెలిస్తే.. ఆయన ఎవరో కాదు జగపతిబాబు. అప్పటికే పలు సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. అలా వీరి కాంబినేషన్లో కబడ్డీ కబడ్డీ, పెదబాబు, పందెం, రక్ష, ఓ మనిషి కథ వంటి సినిమాలు రాగా.. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వీరి కాంబినేషన్లో లెజెండ్, రారా కృష్ణయ్య వంటి సినిమాలు వచ్చాయి.

వాస్తవానికి పెళ్లి కాకముందే జగపతిబాబుతో కళ్యాణికి మంచి స్నేహబంధం ఉండేది. అందులోను వీరిద్దరి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు రావడంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ కారణంగానే సూర్య కిరణ్ ఈ విషయంలో కళ్యాణి తో గొడవపడి విడిపోయారు అని సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గానే మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news