లావణ్య త్రిపాఠి ఆ హీరోతో ప్రేమాయణం నడిపిందా..?

-

ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎప్పటినుంచో వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా మెగా ఇంటికి కోడలు కాబోతోంది. గత రెండు రోజుల క్రితం మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ తో ఆమె నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా సరే ఈ జంటకు సంబంధించిన నిశ్చితార్థ ఫోటోలే చాలా వైరల్ గా మారాయి. ముఖ్యంగా మెగా కుటుంబ హీరోలు అందరిని కూడా ఒకే చోట చూసేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఇకపోతే ఈ నిశ్చితార్థ వేడుకల్లో రామ్ చరణ్ దంపతులతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి గారిని మొదలుకొని రాంచరణ్, అల్లు అర్జున్ , అల్లు శిరీష్, సాయి ధరంతేజ్ , పంజా వైష్ణవ్ తేజ్ ఇలా తదితరులు ఈ నిశ్చితార్థ మహోత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కంటే ముందే మరొకరిని పీకల్లోతు వరకు ప్రేమించిందట. అయితే ఇంతకు ఆ హీరో ఎవరు అనే విషయాన్నికొస్తే ఆయన కూడా మెగా హీరో కావడం గమనార్హం. ఒకానొక సమయంలో లావణ్య త్రిపాఠి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ ని పొగుడుతూ.. వరుణ్ తేజ్ ని తగ్గిస్తూ ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన రాపిడ్ ఫైర్ లో భాగంగా మీకు నచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్ లో ఎవరు ది బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ అని మీరు అనుకుంటున్నారు అంటే ఆమె వెంటనే సాయి ధరమ్ తేజ్ పేరు చెప్పింది. ఏ అమ్మాయి అయినా అలాంటి లక్షణాలున్న అబ్బాయిని కోరుకుంటుందని.. వరుణ్ తేజ్ మంచోడు కాదు అని చెప్పను.. కానీ సాయిధరమ్ తేజ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ లో ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news