BRS నుంచి పోటీ చేస్తా : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

-

తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. స్వతంత్రంగా లేదా ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ఆలోచన లేదన్నారు.

తాను పుట్టిన కొత్తగూడెం అభివృద్దే లక్ష్యంగా సేవా కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. అక్కడి ఆస్పత్రిలో రూ. 2 కోట్లతో ట్రామా సెంటర్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కాగా, ఇటీవల కాలంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు ఓ వివాదానికి తెరలేపారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కతూ అడ్డంగా బుక్కయ్యారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు. గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్‌ కు సన్నిహితంగా ఉంటూ…ఉంటున్న శ్రీనివాస రావు.. కేసీఆర్‌ కాళ్లు మొక్కతు కనబడటం హాట్‌ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news