ఇక్కడి ప్రేక్షకులపై నీళ్ళొదిలేసుకున్న ప్రభాస్…..??

-

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్సకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ రేంజ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులైన భాగ్య శ్రీ, మిథున్ చక్రవర్తి సహా మరికొందరు బాలీవుడ్ నటులు నటిస్తున్నట్లు సమాచారం.

తెలుగుతో పాటు మన సౌత్ భాషలన్నిటితో పాటు హిందీ లో కూడా ఏకకాలంలో రిలీజ్ కానున్న ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఇక రాబోయే రోజుల్లో ప్రభాస్ ఇక్కడకంటే బాలీవుడ్ సినిమా పరిశ్రమపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు చెప్తున్నారు. దానికి రెండు కారణాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఆయన నటించిన చివరి సినిమా సాహో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది.

 

అయితే ఈ సినిమా బాలీవుడ్ లో మాత్రం మంచి వసూళ్లు అందుకోవడం ఒక కారణం అయితే, బాలీవుడ్ అగ్ర నిర్మాతలు, దర్శకులు ఎప్పటినుండో ప్రభాస్ తో డైరెక్ట్ హిందీ సినిమాలు తీయాలని ఎదురు చూస్తుండడంతో ఇకపై ఎక్కువగా ఆయన బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తారని అంటున్నారు. అయితే ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ పైనే కాక, ఇటు మన టాలీవుడ్ సినిమాల్లో కూడా మధ్యలో నటిస్తారని అంటున్న వారున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు మాత్రం వెల్లడి కావలసి ఉంది…!!

Read more RELATED
Recommended to you

Exit mobile version