ప్రభాస్ హర్రర్ మూవీలో ఆ సెట్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా..?

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రేమ, పెళ్లి వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో ప్రేమలో ఉన్నాడు అని, పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు తోడేలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ హీరో వరుణ్ కూడా.. శృతి పేరు వేరొకరి గుండెల్లో ఉంది.. అయితే అతడు ముంబైలో లేడు.. దీపికా పదుకొనేతో షూటింగ్లో ఉన్నాడు అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రభాస్, కృతి సనన్ లవ్ గురించి తెలిపాడు. కానీ ఎట్టకేలకు ఈ విషయంపై కృతి సనన్ స్పందించి వార్తలకు పుల్ స్టాప్ పెట్టింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఒక హర్రర్ కామెడీ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి మూడు రోజులలో ప్రభాస్ పై కీలక సన్నివేశాలను మారుతి చిత్రీకరించారట. మిగిలిన నాలుగు రోజులు ప్రభాస్ లేకుండా ఉన్న సీన్స్ ను ఇతర నటులపై చిత్రీకరించనున్నారట మారుతి . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఫిమేల్ లీడ్ లో మాళవిక మోహనన్ నటిస్తున్నారు.

అంతేకాదు దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని ఒక హార్రర్ ఫాంటసీ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో ఎక్కువ భాగం ఒక ఇంట్లోనే జరగనుందట. ఇప్పుడు ఒకే ఇంట్లోనే షూటింగ్ జరుగుతోంది అని.. ఆ ఇంటికి సంబంధించిన సెట్ ను టీం భారీగా నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సెట్ కోసమే దాదాపుగా రూ. 6 కోట్లు ఖర్చు చేశారట. అంతేకాదు ఈ హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న సినిమాలో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండలున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.