సమంత నిజంగానే తన అత్తను అంతగా అవమానించిందా..!!

-

ప్రముఖ తెలుగు హీరోయిన్ గా పేరు పొందింది సమంత. ఇక ఈ ముద్దుగుమ్మ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన నటనతో అందంతో మాటలతో ఎంతోమంది కుర్రకారులను సైతం మైమరిపించేలా చేస్తూ ఉంటుంది. అందుచేతన ఇప్పటికీ కూడా టాప్ పొజిషన్లో తన స్థానాన్ని దక్కించుకుంది సమంత . మొదట ఏం మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఏం మాయ చేసావే సినిమా సమయంలో నాగచైతన్య సమంత ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

ఆ తర్వాత వీరిద్దరూ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ విధంగా సమంత అక్కినేని కోడలుగా మారడం జరిగింది. కొంతకాలం వీరిద్దరూ బాగానే ఉన్నప్పటికీ కొన్ని కారణాల చేత గత ఏడాది విడిపోవడం జరిగింది. వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం మాత్రం ఇప్పటికి ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది. వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అన్న సంగతి మాత్రం ఇప్పటికి సోషల్ మీడియాలో అక్కడక్కడ పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొక విషయం హాట్ టాపిక్ గా మారుతుంది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం సంబంధించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి.అందులో ఒకానొక సమయంలో వివాహమైన కొత్తలో సమంత అమలను చాలా దారుణంగా తిట్టిందట. అలా తిట్టడంతో నాగార్జునకు సమంత అంటే విపరీతమైన కోపం ఉన్నట్లుగా సమాచారం. ఆ తర్వాత నెమ్మదిగా అక్కినేని కుటుంబం దూరం పెట్టడం జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా అత్త అన్న భావన లేకుండా సమంత అమలాను అలా తిట్టడంతో కుటుంబ సభ్యులందరూ బాధపడినట్లుగా సమాచారం. ఇక రాను రాను సమంత లో కొన్ని క్వాలిటీస్ నచ్చకపోవడంతో నాగచైతన్య విడాకులు ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా నాగార్జున పై సమంత ఎన్నో వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news