దిల్ రాజు కొన్నాడంటే.. మ్యాటర్ ఉన్నట్టే..!

-

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలు చేసిన గుహన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 118. షాలిని పాండే, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. మార్చి 1న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా దర్శక నిర్మాతలు దిల్ రాజు కోసం స్పెషల్ షో వేసి చూపించారట.

సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఉండటంతో దిల్ రాజు తెలుగు రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాడట. సినిమా బడ్జెట్ మొత్తం దిల్ రాజు పెట్టిన ఎమౌంట్ తో వచ్చేశాయట. ఓవర్సీస్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఎలాగు బాగానే పలుకుతాయి. మొత్తానికి రిలీజ్ ముందే కళ్యాణ్ రాం 118 సినిమా హిట్ కొట్టినట్టే చెప్పొచ్చు. ఇక ప్రేక్షకులను కూడా మెప్పిస్తే సినిమా కొన్నందుకు దిల్ రాజు లాభపడతాడు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో వచ్చే శుక్రవారం తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news