అజిత్ ‘విశ్వాసం’ ట్రైలర్.. దమ్ముంటే రారా..!

-

అజిత్ హీరోగా శివ డైరక్షన్ లో వచ్చిన సినిమా విశ్వాసం. తమిళంలో సంక్రాంతి బరిలో దిగి విజయం అందుకున్న ఈ సినిమా తెలుగులో మార్చి 1న రిలీజ్ చేస్తున్నారు. అజిత్, శివ కాంబినేషన్ లో వచ్చిన వీరం, వేదాళం, వివేకం సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. అవన్ని తెలుగులో డబ్ అయ్యాయి ఇక ఇప్పుడు విశ్వాసం సినిమా కూడా తెలుగులో అదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.

అజిత్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను తెలుగులో ఎన్.ఎన్.ఆర్ ఫిలింస్ బ్యానర్ లో ఆర్.నాగేశ్వర్ రావు రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో విలన్ గా జగపతి బాబు నటించారు. మార్చి 1న తెలుగులో రిలీజ్ అవుతున్న విశ్వాసం ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news