టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టి ప్రస్తుతం టాప్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్న వ్యక్తి దిల్ రాజు. ఈయనను టాలీవుడ్ లో గోల్డెన్ రాజు అని కూడా పిలుస్తారు. ఈ మధ్య కాలంలోనే రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు పూర్తిగా తన లుక్ ను మార్చేశాడు. నిజానికి ఆయన లుక్ చూస్తే ఆయనను దిల్ రాజు అని గుర్తు పట్టడం కష్టమే. ఆయన ఎంతలా మారిపోయాడంటే ప్రస్తుతం 50 ఏళ్ళు ఉన్న దిల్ రాజు 30 ఏళ్ల కుర్రాడిలా కనిపించేలా. తన రెండో వివాహం తర్వాత దిల్ రాజు పూర్తిగా తన మేక్ ఓవర్ ని మార్చేశాడు. అలాగే తన ఫిట్ నెస్ పై కూడా ఫోకస్ చేసినట్లు అర్థమవుతోంది.
కరోనా నేపథ్య కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఆయన పూర్తిగా ఫిట్ నెస్ పైనే దృష్టి పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా తన భార్యతో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన తర్వాత దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూస్తే దిల్ రాజు ఆరోగ్యంగా ఉండటానికి బాగానే కష్టపడుతున్నట్లు ఇట్లే అర్థమవుతోంది.