”లవ్ యూ ఇండియా” ట్రంప్ వైరల్ ట్వీట్…! మోడీ ట్వీటు ట్రంప్ రీ-ట్వీటు…!

-

భారతదేశానికి నిజమైనా మిత్రుడిని అంటూ చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు భారత్ పై ఉన్న ప్రేమను మరోసారి రుజువు చేసుకున్నాడు. భారత ప్రధాని మోడీ చేసిన ట్వీట్ కు అద్భుతంగా రిప్లై ఇచ్చాడు. ‘అమెరికా లవ్స్ ఇండియా’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశాడు. దాంతో ఆ ట్వీటు ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

trump and modi
trump and modi

అమెరికా 244వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ ప్రజలకు అధ్యక్షుడు ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఓ సందేశాన్ని పంపారు. దీనికి స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ‘థ్యాంక్యూ మై డియర్ ఫ్రెండ్.. అమెరికా లవ్స్ ఇండియా’ అని పేర్కొంటూ మోడీ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. ఇలా భారత్ పై మరోసారి తన అభిమానాన్ని ట్రంప్ ట్విట్టర్ ద్వారా చాటుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news