దర్శకురాలు బి. జయ ఆకస్మిక మరణం

-

ప్రముఖ దర్శకురాలు బి.జయ గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు. ప్రముఖ పి.ఆర్.ఓ బిఏ రాజు సతీమణి అయిన జయ సిని జర్నలిస్టుగా డైనమిక్ లేడీ అన్న పేరు సంపాదించారు బి.జయ. వెస్ట్ గోదావరి నుండి వచ్చిన ఆమె పిజి తర్వాత జర్నలిజం డిప్లోమా చేసి ఆంధ్రజ్యోతిలో పనిచేయడం జరిగింది. సీనియర్ పి.ఆర్.ఓ బిఏ రాజు భార్యగానే కాదు దర్శకురాలిగా జయ మంచి పేరు రెచ్చుకున్నారు.

చంటిగాడు సినిమాతో ఆమె మెగా ఫోన్ పట్టుకోగా లాస్ట్ ఇయర్ వచ్చిన వైశాఖం జయ చివరి దర్శకత్వం వహించిన సినిమా. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుది శ్వాస విడిచారు. ఇండస్ట్రీకి ఎంతో కావాల్సిన వ్యక్తి అయిన బే రాజు ఇంట్లో విషాదం సినిమా పరిశ్రమకు షాక్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news