ఫోన్ స్విచ్చాఫ్..ముంబైలో తప్పించుకు తిరుగుతున్న డైరెక్టర్ క్రిష్!

-

ఫోన్ స్విచ్చాఫ్.. డ్రగ్స్ కేసు విచారణకు రాకుండా ముంబైలో డైరెక్టర్ క్రిష్ తప్పించుకు తిరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.హైదరాబాద్‌లో రాడిసన్‌ హోటల్‌ కేంద్రంగా జరిగిన డ్రగ్స్‌ పార్టీ కేసులో రోజుకో ట్విస్ట్ కలుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు ఫోన్‌ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు సమాచారం.

మరోవైపు డ్రగ్స్‌ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్‌ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. శుక్రవారం వస్తానని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కానీ ఫోన్ స్విచ్చాఫ్.. డ్రగ్స్ కేసు విచారణకు రాకుండా ముంబైలో డైరెక్టర్ క్రిష్ తప్పించుకు తిరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.దింతో రేపు విచారణకు రావొచ్చని చెబుతున్నారు పోలీసులు. రాడిసన్ పబ్ కేసులో ఎన్నో అనుమానాలు తెర పైకి వస్తున్నాయి. స్టార్ హోటల్లో మొత్తం 209 కెమెరాలు ఉన్నా.. డ్రగ్స్ పార్టీ జరిగిన రూం వైపు కెమెరాలు పనిచేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news