విజయ్ కోసం మారుతి స్కెచ్

-

ఈరోజుల్లో సినిమా నుండి రాబోతున్న శైలజా రెడ్డి అల్లుడు వరకు డైరక్టర్ మారుతి సినిమా అంటే కచ్చితంగా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ అనేలా ఉంటుంది. నాగ చైతన్య హీరోగా వస్తున్న శైలాజ రెడ్డి అల్లుడు ట్రైలర్ చూసి చెప్పొచ్చు మళ్లీ మారుతి తన క్రేజీ ఫార్ములాతో ఆడియెన్స్ ను మెప్పించేందుకు వస్తున్నాడని. ఇక ఈ సినిమా తర్వాత మారుతి ఓ కొత్త కథ రాసుకున్నాడట.

ఇప్పటివరకు కామెడీ, ఎంటర్టైనర్ సినిమాలకు ప్రిఫరెన్స్ ఇచ్చిన మారుతి ఈసారి సీరియస్ సబ్జెక్ట్ మీద వర్క్ అవుట్ చేస్తున్నాడట. లైన్ ఫైనల్ అవగా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. తన దృష్టిలో విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ ఉందట. స్క్రిప్ట్ పూర్తి చేశాక విజయ్ తో డిస్కస్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ. మరి మారుతికి ఛాన్స్ ఇస్తాడా లేడా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news