స్టార్ హీరో దయనీయమైన పరిస్థితి..!

-

స్టార్ రేంజ్ ఉన్నంత వరకు ఓకే కాని ఆ స్టార్ ఇమేజ్ కాస్త తగ్గితే వారి స్థానంలో కొత్త వారు రావడంతో పాత వారిని మర్చిపోతారు. ఈ టైంలో సీనియర్ స్టార్స్ గురించి ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అయ్యింది. అలానే కోలీవుడ్ స్టార్ హీరోగానే కాదు రాజకీయ నాయకుడు అయిన విజయ్ కాంత్ నేటి పరిస్థితి దారుణంగా మారింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం కోలుకున్నా మరొకరి సపోర్ట్ తో నడవడం ఆశ్చర్యంగా మారింది.

ఇటీవల మరణించిన కరుణానిధికి నివాళి అర్పించేందుకు మెరీనా బీచ్ లో కరుణానిధి సమాధి వద్దకు వచ్చారు విజయ్ కాంత్. కొన్నాళ్లుగా వార్తల్లో లేని ఆయన ఇలా కనిపించడం ఆయన ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేసింది. డిఎండికే అధినేత అయినా సరే కరునానిధి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండటంతో సమాధి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారు విజయ్ కాంత్.

Read more RELATED
Recommended to you

Latest news