ప్రముఖ నటికి అసభ్యకర సందేశాలు పంపిన అగ్ర దర్శకుడి అరెస్ట్

-

మాలీవుడ్ (మలయాళ) అగ్ర దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ నటి మంజూ వారియర్ ‌ను లైంగికంగా వేధిస్తున్న నేపథ్యంలో పోలీసులు దర్శకుడిని అదుపులోకి తీసుకున్నారు.

స్టార్ యాక్ట్రెస్ మంజూ వారియర్ సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా ఉంది. ఈమె మలయాళ సినీ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వంలో ‘కయాట్టం’ అనే సినిమా చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత దర్శకుడు సనల్ తనకు అసభ్యకర మెసేజ్ లు పంపుతున్నాడని మంజూ వారియర్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అటువంటి మెసేజెస్ పంపొద్దని రిక్వెస్ట్ చేశానని, అయినప్పటికీ వినకపోతే వార్నింగ్ కూడా ఇచ్చానని మంజూ వారియర్ చెప్తోంది. అయినా అతని తీరు మారకపోవడంతో సనల్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది మంజూ వారియర్.

కేసు దర్యాప్తు చేసిన తిరువనంతపురం పోలీసులు తాజాగా సనల్ కుమార్ ఇంటికి మఫ్తీలో వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, దర్శకుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం మలయాళ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news