మహేష్ ని వద్దంటున్న దర్శకులు…?

-

టాలీవుడ్ లో మహేష్ బాబు కోసం ఒకప్పుడు దర్శకుల నుంచి మంచి ఆదరణ ఉండేది. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిన దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారు. కాని ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి ఏ దర్శకుడు కూడా ముందుకి రావడం లేదు. ఆయన ఎప్పటి నుంచో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అయినా సరే త్రివిక్రమ్ మాత్రం ఆయనతో సినిమా చేయడానికి ముందుకి రావడం లేదు. ఎన్టీఆర్ తో సినిమాకు కథ రెడీ చేసుకున్నాడు గాని మహేష్ తో సినిమా చేయడానికి రాలేదు.ఇక ఇది పక్కన పెడితే ఆయన సరిలేరు నీకెవ్వరు సినిమా దర్శకుడు అనీల్ రావిపూడి తో సినిమా చెయ్యాలని మళ్ళీ ప్రయత్నం చేసి మూడు నెలల సమయంలో కథ రెడీ చెయ్యాలని కోరారు. దానికి అనీల్ ఆసక్తి చూపించలేదు.

కథ రెడీ చేయలేను అని చెప్పారట. తాను ఇప్పుడు బిజీ గా ఉన్నాను అని చెప్పినట్టు సమాచారం. ఇక వంశీ పైడపల్లి విషయంలో కూడా ఇదే జరిగింది. వంశీ తో మహేష్ సినిమా చేస్తాడు అనుకున్నారు. కాని ఏమైందో ఏమో తెలియదు గాని మహేష్ కోసం కథను అంత సీరియస్ గా తీసుకుని రెడీ చేయలేదు. ఇక పరుశురాం ఒక్కడే ఆయనతో సినిమా చేయడానికి ముందుకి వచ్చాడు. ఆయనతోనే ఇప్పుడు సినిమా చేస్తున్నాడు మహేష్.

Read more RELATED
Recommended to you

Latest news