ఆ టాలీవుడ్ స్టార్ హీరో కుమార్తెకు విడాకులు…?

-

సినిమా రంగంలో ఉన్న‌వాళ్లు ప్రేమించుకోవ‌డం… పెళ్లిళ్లు చేసుకోవ‌డం… ఆ వెంట‌నే విడాకులు తీసుకోవ‌డం చాలా కామ‌న్‌. బాలీవుడ్‌లో అయితే ఎప్ప‌టి నుంచో ఈ సంస్కృతి ఉంది. సౌత్‌లో ముఖ్యంగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఈ సంస్కృతి దూరం. తెలుగు హీరోలు పెద్ద‌లు కుదిర్చిన వివాహం చేసుకున్నా.. ప్రేమ వివాహం చేసుకున్నా విడాకుల సంస్కృతి ఉండ‌దు. తెలుగులో పెద్ద హీరోల విడాకులు అంటే చాలా అరుదైన విష‌య‌మే.

బాలీవుడ్‌లో ఇది చాలా కామ‌న్‌. అయితే మారుతున్న ట్రెండ్స్‌, స‌మాజ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇప్పుడు తెలుగులో కూడా సినిమా వాళ్ల‌లో విడాకుల సంస్కృతి ఎక్కువైంది. మూడు రోజుల క్రిత‌మే మంచు ఫ్యామిలీ హీరో మంచు మ‌నోజ్ త‌న భార్య ప్ర‌ణ‌తిరెడ్డి నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని మ‌నోజ్ అధికారికంగా ప్ర‌క‌టించాడు.

ఈ వార్త నుంచి ఇండ‌స్ట్రీ కోలుకుందో లేదో ఇప్పుడు మ‌రో షాకింగ్ న్యూస్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఓ టాప్ హీరో కుమార్తె త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతోంద‌ట‌. ఇండ‌స్ట్రీలో ఆయ‌న పెద్ద హీరో… స్టార్ హీరో… ఆయ‌న ఇద్ద‌రు కుమార్తెలో ఓ కుమార్తెను ఓ బిజినెస్‌మేన్‌కు ఇచ్చి కొన్ని సంవ‌త్స‌రాల క్రిత‌మే పెళ్లి చేశారు. కొద్ది రోజులుగా మ‌న‌స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో ఆమె త‌ల్లిదండ్రుల వ‌ద్దే ఉంటోంది.

అలాగే తండ్రికి సినిమాల విష‌యంలో హెల్ఫ్ కూడా చేస్తోంది. తండ్రి సినిమాల‌కు స్టిల్స్‌, కాస్ట్యుమ్స్ మొత్తం ఆమే ప‌ర్య‌వేక్షిస్తోంది. అస‌లు ఆమె భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వెళ్లే చాలా రోజులు అయ్యింది అంటున్నారు. ఆ జంట విడిపోయేందుకు సిద్ధం కాగా.. సదరు పెద్ద హీరో కూడా కుమార్తె నిర్ణయానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news