అస్తమానం కోపం ఎందుకు వస్తుంది? వస్తే ఏయవుతుంది?

-

మనిషికి కోపం, నవ్వు, ఆనందం, క్రోదం ఇవన్నీ సహజమే. వీటిలో ఏది ఎక్కువైనా సమస్యే. ఆ విధంగా కోపం రావడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. కోరుకున్నది దొరక్కపోవడం, ఇష్టమైనది జరగకపోవడం, మాటకు మాట అందివ్వడం చెప్పన మాటలను ధిక్కరించడంతో కోపం వస్తుంది. కోపం తెప్పించిన పనులను ఒకసారి నిదానంగా ఆలోచించగలిగితే కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

కోపం వస్తే ఏమవుతుంది?
కొందరికి కోపం వచ్చినప్పుడు ఎదుటివారిని తిట్టలేక తమలో తామే మదనపడుతుంటారు. కోపం కాస్త కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. మరికొందరు అయితే కోపాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టమైన వారికి ఫోన్‌ చేసి మరీ తిట్టి తమ కోపాన్ని పోగొట్టుకుంటారు. చిన్నపిల్లలయితే భోజనం మాని తమను తాము హింసించుకుంటారు. అయితే ఇలాంటి కోపం వల్ల మీకు కోపం వచ్చిందని ఎదుటివారికి అర్థం కాకపోగా, కుటుంబీకులు బంధువులు, మిత్రులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీకు కోపం వచ్చిందని ఎదుటివారికి అర్థమైనా.. ఇది ఎప్పుడూ ఉండేదాగా అని వదిలేస్తారు. ఇది మీకు మరింత ప్రమాదకరం అవుతుంది. అందుకే.. మీకు కోపం వచ్చినప్పుడు దానికి కారణం అయిన వారిని డైరెక్ట్‌గా కలసి మనసులో ఉన్నదాన్ని అడిగి కడిగేసుకోవాలి. అంతేగాని లోలోపల బాధపడడం వల్ల ప్రయోజనం ఉండదు.

కోపానికి పరిష్కారం :
1. కాలు జారితే తీసుకోగలం కాని నోరు జారితే వెనక్కి తీసుకోలేం అని ఊరికే అనలేదు పెద్దలు. అందుకే నోరు అదుపులో ఉంచుకోవాలంటారు. మాట్లాడే ప్రతీమాట ఆచితూచి అడుగులు వేయాలంటారు. ఒక్కోసారి పక్కవారి మాటలు విని బెస్ట్‌ ఫ్రెండ్స్‌నే అనుమానిస్తుంటాం. అది పెద్ద పొరపాటు. ఎదుటివారు చెప్పింది వినాలి. అంతే.. అది నిజమో కాదో నిర్థారించుకున్న తర్వాతే యాక్షన్‌లోకి దిగాలి. అంతవరకు ప్రేక్షకుడిలా వేచి ఉండాలి. కోపం వచ్చినప్పుడు ప్రతి మాటకు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. లేదా మౌనంగా ఉండడం ఇంకా మంచిది. కోపాన్ని తగ్గించుకోవడదానికి అంకెలను లెక్కపెట్టుకోవడమే.. కోపం వస్తే ధీర్ఘంగా శ్వాసిస్తూ ఒకటి నుంచి పది అంకెలు లెక్కపెడితే క్రమంగా కోపం తగ్గిపోతుంది.

2. ఆత్మన్యూనత భావం కలవారు ప్రతి విషయానికి కోపం తెచ్చుకుంటారు. ఇందువల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇందుకు పరిష్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే. కొన్ని రాకల వ్యాధుల వల్ల కూడా మనుషులకు పిలువకుండానే కోపం వస్తుంది. ముఖ్యంగా ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి కోపిష్టులపై సానుభూతి చూపి మంచి మాటలతో ఊరడించాలి. ఈసారి ఎప్పుడైనా మీకు కోపం వస్తే.. అద్దంలో ముఖం చూసుకోండి. కోపం మీ హావభావాలు ఎంత వికృతంగా ఉంటాయంటే.. వాటిని అద్దంలో చూసుకుంటే చాలు మరోసారి మీకు కోపం రమ్మన్నా రాదు సుమా..

Read more RELATED
Recommended to you

Latest news