DJ Tillu movie review : డీజే టిల్లు మూవీ రివ్యూ.. రెచ్చిపోయిన సిద్దు

-

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తాజా సినిమా డీజే టిల్లు. అట్లే ఉంటది మనతోనే అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను pdv ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇవాళ విడుదల అయింది. అయితే ఈ సినిమాపై మిక్స్ డ్ టాక్ వస్తోంది.


కథ: బాల గంగాధర్ తిలక్ అకా DJ టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) ఒక మధ్యతరగతి యువకుడు మరియు ఔత్సాహిక DJ. ప్రొఫెషనల్ సింగర్ అయిన రాధిక (నేహా శెట్టి) ఒక హత్య కేసులో చిక్కుల్లో పడింది. రాధికను కష్టాల నుంచి తప్పించుకోవడానికి టిల్లు ఎలా సహాయపడుతుందో సినిమాలో చూపించారు. సినిమా అంతా 19 షో లో నటించాడు సిద్దు జొన్నలగడ్డ. తను రాసుకున్న కథ… తన స్క్రీన్ ప్లే కదా… అందుకే స్క్రీన్ అంతా తానే కనిపించాడు. కాల్ టు సిద్ధూ కూడా డామినేట్ చేస్తూ హీరోయిన్ అదరగొట్టింది. తన మార్క్ యాక్టింగ్ ఎలా ఉంటుందో చూపించింది.

ఇక సినిమా విషయానికి వస్తే… అంతా బానే ఉంది. కానీ సెకండాఫ్ సినిమా పై ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. ఫస్టాఫ్ సినిమాను జోరుగా తీసుకువెళ్ళిన టీం.. సెకండాఫ్ విషయంలో గట్టిగానే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గా విమల్ కృష్ణ తలపెట్టినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒకటే పాయింట్ మీద దృష్టిపెట్టి సినిమాల్లో కొన్ని విషయాలు గాలికి వదిలేశారు. ఇక మరి కొంత మంది మాత్రం సిద్దు ఈజ్ బ్యాక్ అని చెబుతున్నారు. అయితే ఇందులో హీరో పెర్ఫార్మెన్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ అదిరిపోయే సౌండ్ ఇచ్చింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సినిమా భారీ హిట్ అనిపించుకోవడం కష్టమే కానీ…లవర్స్ ను మాత్రం అలరిస్తుంది.

పాజిటివ్స్ :
• సిద్ధు క్యారెక్టరైజేషన్
• డైలాగ్స్
• అత్యాధునిక సంగీతం
• ఫస్ట్ హాఫ్ లో థమన్ BGM

నెగిటివ్స్ :

• కథ లేదు, సిల్లీ ప్లాట్
• సెకండాఫ్ మొత్తం బోరింగ్ గా ఉంది తీర్పు : DJ టిల్లు సినిమా ఫస్ట్ హాఫ్ ట్రెండీగా, కనెక్ట్ అయ్యే వినోదాత్మకంగా ఉంటుంది. సెకండాఫ్ మొత్తం హాస్యాస్పదంగా, బోరింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంత వసూళ్లు రాబట్టవచ్చు.

రేటింగ్ : 2.5/5

Read more RELATED
Recommended to you

Latest news