సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా ..?

-

అక్కినేని సమంత గత సంవత్సరం మజిలీ, ఓ బేబీ వంటి సూపర్ హిట్ సినిమాలని తన ఖాలో వేసుకుంది. ఇక ఈ వారం ప్రేక్షకుల ముందుకు జాను సినిమాతో వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 సినిమాకి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. తమిళంలో త్రిష కి కం బ్యాక్ మూవి అయిన 96 లో విజయ్ సేతుపతి నటించాడు. ఇక్కడ సమంత కి జంటగా శర్వానంద్ నటించాడు. ఇద్దరి పర్ఫార్మెన్స్ కి ఏమాత్రం వంక పెట్టడానికి వీలు లేదు.

 

అయితే ప్రేక్షకులు ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయిందన్న టాక్ బాగా వచ్చింది. ఇందులో హీరో హీరోయిన్స్ తప్పేమీ లేకపోయినప్పటికి ఎఫెక్ట్ మాత్రం వాళ్ళమీదే పడింది. అసలే శర్వా కి గత కొంతకాలంగా వరుస ఫ్లాపులు వచ్చి పడుతున్నాయి. అందుకే ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంటే అది కాస్త తేడా కొట్టేసింది. ముఖ్యంగా సమంత పక్కన శర్వా అసలు సూటవలేదన్న విమర్శలు వచ్చాయి. దాంతో జాను ద్వారా శర్వా కి ఒరిగిందేమీ లేదని చెప్పాలి.

 

ఇక సమంత గత రెండు చిత్రాలు సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా మీద కూడా ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ సమంత ఫర్ఫార్మెన్స్ పరంగా 100 కి 100 శాతం న్యాయం చేసింది. కాని సినిమానే సమంతకి న్యాయం చేయలేకపోయింది. దాంతో అక్కినేని ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ కాస్త డిసప్పాయింట్ లో ఉన్నారు. ఇక ప్రస్తుతం సమంత కమిటయిన సినిమాలు కూడా ఏమీ లేవు. సినిమాల పరంగా ఖాళీనే. కానీ ఫ్యామిలీ మాన్ 2 లో మాత్రం మంచి రోల్ లో ప్రేక్షకులను కనువిందు చేయడానికి రెడీ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version