ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ త్వరలోనే జైలుకు వెళ్తారని విపక్ష పార్టీలు మరియు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పదే పదే ప్రచారం చేస్తోంది. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ సరైన టైంలో జగన్ ని జైల్లో కి పంపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ని బలోపేతం చేయడానికి స్కెచ్ వేస్తున్నట్లు ఇలా రకరకాల కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
ముఖ్యంగా చాలా నిర్ణయాలలో దూకుడుగా జగన్ వ్యవహరించడం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నచ్చటం లేదని కుర్రోడు ని కంట్రోల్ చేయాలని జైలుకు పంపాలని అప్పుడు మాట వినటం జరుగుతుందని దానికి తగ్గ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఇందువల్లనే జగన్ కి ఇటీవల బిజెపి పార్టీ భయం పట్టుకుందని విపక్ష పార్టీలు కామెంట్లు చేస్తున్నారు. అక్రమాస్తుల కేసుల విషయంలో ఏ సమయం అయినా శశికళ మాదిరిగా జగన్ వెళ్లే అవకాశం ఉందని..నియంతలా వ్యవహరిస్తున్న జగన్ కి కచ్చితంగా కేంద్రం కట్టడి చేయడం గ్యారెంటీ అని కూడా అంటున్నారు
.
దీంతో పచ్చ మీడియా టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు వైసిపి పార్టీ నేతలు గట్టిగా కౌంటర్లు వేశారు. అయితే అసలు జగన్ కి జైలు భయం అనేది లేదని…నిజంగా జైలుకు వెళ్లే ప్రసక్తే ఉంటే ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియాగాంధీ ఊరికునేదా..? తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ చాన్స్ మిస్ చేసుకునేదా..? ఇదంతా జగన్ ని ప్రజల ముందు బ్లేమ్ చేయటానికి టీడీపీ మరియు ఆ పార్టీకి మద్దతు తెలిపే ఛానల్స్ డ్రామా అని వైసిపి పార్టీ నేతలు వస్తున్న ఈ వార్తలను ఖండించారు.