బాలయ్య నటించిన తొలి చిత్రంపై నిషేధం.. ఈ సంగతి మీకు తెలుసా?

-

తెలుగు వారి ఆరాధ్య నటుడు, విశ్వ విఖ్యాత న‌ట సార్వభౌమ నంద‌మూరి తార‌క‌రామారావు
వారసుడిగా వెండితెరకు పరిచయమైన బాలయ్య సినీ రంగంలో ముందుకు సాగుతున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోగా తనదైన పంథాలో చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. ఆయన నటించిన ‘అఖండ’ చిత్రం ఇటీవల విడుదల కాగా, అది ప్రేక్షకుల ‘అఖండ’ ఆదరణకు నోచుకుంది.

ప్రస్తుతం బాలయ్య ‘క్రాక్’ ఫేమడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ‘ఎన్ బీకే 107’ ఫిల్మ్ చేస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తుండగా, బాలయ్యకు జోడీగా విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ సంగతులు పక్కనబెడితే బాలయ్య నటించిన తొలి చిత్రం కొద్ది రోజుల పాటు నిషేధించబడిందన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. అందుకు గల కారణాలేంటో తెలుసుకుందాం.

బాలయ్య నటించిన తొలి పిక్చర్ ‘తాతమ్మ కల’. కాగా, ఈ చిత్రానికి ఎన్టీఆర్ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని ప్రభుత్వం కొద్ది రోజుల పాటు నిషేధించింది. తర్వాత ఎన్టీఆర్ దీనిని మార్చి తీయగా మళ్లీ విడుదల చేశారు.

‘కుల గౌరవం’ చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న సీనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత రామ‌కృష్ణ సినీ స్టూడియో బ్యానర్ పై ‘తాత‌మ్మ క‌ల’ చిత్రాన్ని తీయాలనుకున్నారు. రైటర్ నరసరాజు స్టోరిపై డిస్కషన్స్ స్టార్ట్ చేశారు. అలా అప్పుడే ఈ చిత్రానికి భానుమతి మెయిన్ క్యారెక్టర్ అయిన పెద్దావిడగా ఫైనల్ అయింది.

రామారావు తాతయ్య పాత్రో పోషిస్తే తాను తాతమ్మ పాత్ర పోషిస్తానని భానుమతి పేర్కొనగా అలానే జరిగింది. ఈ పిక్చర్ లో స్టోరి ప్రకారం ఇంటిలో నలుగురు కొడుకులు, కూతురు ఉంటారు. ఇందులో హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా నటించారు.

కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ కొన్ని డైలాగ్ లు భానుమతి పాత్రలో చెప్పారు. ఈ క్రమంలోనూ భూ సంస్కరణలకు వ్యతిరేకంగానూ వ్యాఖ్యాలున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్రాన్ని రెండు నెలల పాటు నిషేధించారు. దాంతో ఎన్టీఆర్ చిత్రాన్ని మార్చి తీశారు. తొలుత బ్లాక్ అండ్ వైట్ లో ఫిల్మ్ రిలీజ్ కాగా, తర్వాత రంగులలో విడుదలైంది. ఇకపోతే ఈ చిత్రంతోనే బాలయ్యలోని నటనాసక్తిని ఎన్టీఆర్ గుర్తించారట. తండ్రి చెప్పినట్లు సినిమాలో చక్కగా నటించి బాలయ్య మంచి పేరు సంపాదించుకున్నారు. నేటికీ బాలయ్య హీరోగా కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news