తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1000 కి పైగా సినిమాలలో నటించిన అల్లు రామలింగయ్య హాస్య ప్రధాన పాత్రలే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇక సినిమాల్లోకి రాకముందు హోమియోపతి డాక్టర్ అలాగే స్వాతంత్ర సమరయోధుడు కూడా. నాటకాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చినాయన అనేక హాస్య ప్రధాన పాత్రలో నటించారు. 2004లో మరణించే వరకు కూడా సినిమాలలో అలరించిన అల్లు రామలింగయ్య ఇటీవల అక్టోబర్ 1 వ తేదీన శత జయంతి దినోత్సవ వేడుకలను ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా పూర్తి చేశారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఇమ్మంది రామారావు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
హాస్య ప్రధాన పాత్రలో నటించిన ఆయన ఎంత ధైర్యవంతుడు అనే విషయం ఆయన మూడో కుమారుడు మరణించినప్పుడే తెలిసింది. అల్లు రామలింగయ్య గారి మూడవ అబ్బాయి ట్రైన్ ప్రయాణం చేస్తూ తల ఎలక్ట్రిక్ పోల్ కి తగిలి అక్కడికక్కడే మరణించారు. అలా హఠాత్తుగా కొడుకు మరణించినా కూడా అల్లు రామలింగయ్య గారు తన ధైర్యాన్ని కోల్పోలేదు . కుటుంబాన్ని ఓదార్చారు. వారికి కాలం తీరిపోయింది మరణించాడు అని చెప్పారు… ఇక అలా నిబ్బరంగా కుటుంబానికి ధైర్యం చెప్పారు.. చాలా మహోన్నతమైన వ్యక్తి అంటూ అల్లు రామలింగయ్య గురించి చాలా గొప్పగా చెప్పారు ఇమంది రామారావు.
ఇక అల్లు రామలింగయ్య కూతురు సురేఖను మెగాస్టార్ చిరంజీవికి వివాహం చెయ్యగా.. ఆయన కుమారుడు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా గీత సంస్థ ద్వారా సినిమాలను తీస్తున్నారు. ఇక అల్లు రామలింగయ్య మనవళ్లుగా అల్లు అర్జున్ అగ్ర హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు . ముఖ్యంగా అల్లు కుటుంబం నుంచి అగ్ర హీరోగా అల్లు అర్జున్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. అల్లు బాబి ప్రొడక్షన్ ఫీల్డ్ లో కొనసాగుతూ ఉండగా అల్లు శిరీష్ సినిమాలలోనే హీరోగా నటిస్తున్నారు.