ఎన్నో సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మల్టీస్టారర్ సినిమాగా వచ్చిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఈ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇందులో మహేష్ బాబు వెంకటేష్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమా జనవరి 11-2013 లో విడుదలయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.54.75 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇంతటి ఘన విజయం సాధించిన చిత్రాన్ని వదులుకున్న కొంత మంది హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.
ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా కూడా అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాష్‌రాజ్ రచయితగా సిరివెన్నెల, హీరోయిన్ అంజలి కి నంది అవార్డులు దక్కాయి. ఇక మరి కొంత మందికి కూడా ఇందులో కొన్ని అవార్డులు లభించాయి. ఈ సినిమాకి హైలెట్ గా నిలిచిన గీత పాత్రకి సమంతనే తీసుకున్నారు. సమంతగత సినిమాల వరకు సింగర్ చిన్మయి సమంతకు డబ్బింగ్ చెప్పిందట. ఈ సినిమాతో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది సమంత.
ఇక సీత పాత్ర విషయానికి వస్తే ఇందులో ముందుగా హీరోయిన్ త్రిష ని సంప్రదించగా ఆమె నిరాకరించింది. మరొక హీరోయిన్ స్నేహాన్ని కూడా అడగగా.. ఆమె కూడా నిరాకరించింది. ఇక హీరోయిన్ భూమిక అని కూడా అడగలేదు గతంలో ఒక్కడు ఈ సినిమాతో మహేష్ కు జోడీగా నటించారు ఇప్పుడు వదిన పాత్రలో నటించలెనని చెప్పింది. ఇక మరొక హీరోయిన్ అనుష్క అని అడగగా తనకు ఆ పాత్ర నచ్చలేదని రిజెక్ట్ చేసింది. చివరికి ఎట్టకేలకు అమలాపాల్ ఒప్పించ గా ఆమె కూడా ఎందుకో ఈ చిత్రం నుంచి తప్పుకుంది.. దాంతో ఈ క్యారెక్టర్ అంజలికి చెప్పడంతో విని ఓకే చేసింది. ముందుగా ఈ చిత్రాన్ని మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాలని అనుకున్నారు కానీ చివరికి మహేష్ ప్లేస్‌లో వెంకీ వచ్చారు. ఇక రేలంగి మామయ్య పాత్రల హీరో రాజశేఖర్ ని అనుకో గా ప్రకాష్ రాజ్ ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో సస్పెన్స్ లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.