టెస్లా సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కు ట్విట్టర్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇటీవల ట్విట్టర్‌ను 44 బిలియన్లకు కొనుగోలు చేస్తానని ఎలాన్ మస్క్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంస్థకు సంబంధించిన అకౌంట్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని ఆరోపించారు. ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై క్లారిటీ ఇచ్చేంతవరకు ట్విట్టర్ కొనుగోలు చేయలేమని ఎలాన్ మస్క్ తెలిపారు. అయితే తాజాగా ట్విట్టర్ ఒక ప్రకటన చేసింది. హెచ్ఆర్ఎస్ చట్టం ప్రకారం.. నిరీక్షణ కాలం ముగిసిందని ట్విట్టర్ ఐఎన్‌సీ శుక్రవారం తెలిపింది.
నిరీక్షణ సమయం ముగిసిందని ట్విట్టర్ పేర్కొంది. ఒకవేళ ట్విట్టర్ కొనుగోలు చేయాలని అనుకుంటే స్టాక్ హోల్డర్ల ఆమోదం తప్పనిసరి అని పేర్కొన్నారు. హెచ్ఎస్ చట్టం నిబంధనలకు మేరకు భారీ లావాదేవీలపై ఫెడరల్ ట్రేడ్ కమీషన్, యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిక్ యాంటీట్రస్ట్ డివిజన్లు రివ్యూ చేయాలి. అనంతరం నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా, మరో ఆరు నెలల్లో ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతిలో వెళ్లాల్సి ఉండేది.