సీనియర్ నటి జమున మరణించే లోపు ఎంత ఆస్తి కూడబెట్టారో తెలుసా..?

-

ప్రముఖ సీనియర్ హీరోయిన్.. దివంగత నేటి జమున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెర పై సత్యభామగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న ఈమె తెలుగు, హిందీ తో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. ఎన్నో చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకులలో సత్యభామగా చెరగని ముద్ర వేసుకున్న ఈమె తనను తప్ప మరెవరిని ఆ పాత్రలో ఊహించుకోలేము అనే అంత అద్భుతంగా నటించి తన నటనతో మెప్పించింది.

పదుల సంఖ్యలో సినిమాలలో సావిత్రికి చెల్లి పాత్రలో నటించిన జమున నిజజీవితంలో కూడా సావిత్రితో చాలా సన్నిహితంగా కొనసాగేది. ముఖ్యంగా అలనాటి స్టార్ హీరోలు అందరితో కూడా జోడిగా నటించిన ఈమె ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు తనకు అవకాశాలు ఇవ్వని సమయంలో కూడా ఏకంగా 18 సినిమాలలో నటించి తన స్థాయి ఏంటో నిరూపించింది. ఇక నటనలో వున్నప్పుడే భారీ స్థాయిలో ఆస్తులను కూడబెట్టారు జమున. ఈమె ఆస్తుల విలువ సుమారుగా అప్పట్లోనే 50 కోట్ల రూపాయలకు అటూ ఇటుగా ఉంటుందని సమాచారం.

జూబ్లీహిల్స్ లో ఖరీదైన భవంతి కూడా ఆమె సొంతం. ఆ భవంతి సుమారుగా 2000 గజాలు ఉంటుందని, కొండాపూర్ లో కూడా ఒక ఫ్లాట్ తోపాటు ఆమెకు పాత బంగ్లా కూడా ఉందని సమాచారం. ఇక ఈమె చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే పలు వివాదాల ద్వారా ఎప్పుడూ వార్తల్లోనే నిలిచే ఈమె.. తన తప్పు ఉంటే కచ్చితంగా క్షమాపణలు కూడా చెప్పేవారు. ఇక తన భర్త పేరు రమణా రావు. ఈ దంపతులకు వంశీ , స్రవంతి జన్మించగా.. కొడుకు ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక కొన్ని కారణాలవల్ల జమున మరణించినప్పుడు ఆమె కూతురు స్రవంతి దగ్గరుండి మరీ జమున అంత్యక్రియలను పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news