స్ఫూర్తి: ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి.. పంటలతో ఏడాదికి రూ. కోట్లు..!

-

కొంత మంది విజయాన్ని చూస్తే చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. కొంత మంది ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని, అనుకున్నది సాధించడం కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఇంజనీరు ఉద్యోగం వదిలేసి ఔషధ పంటలు పండిస్తూ ఏకంగా ఏడాదికి కోట్ల సంపాదిస్తున్నాడు ఒక యువకుడు. అతని సక్సెస్ ని చూశారంటే మీరు కూడా శభాష్ అంటారు.

 

వివరాల్లోకి వెళితే కలబంద సాగు కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసుకుని రైతుగా పంటలు పండించడం మొదలు పెట్టాడు. రైతుగా మారిన ఇంజనీర్ హరీష్ దందేవ్ రాజస్థాన్ నివాసి. హరీష్ దందేవ్ మొదటి ప్రభుత్వ ఇంజనీర్ అయితే ఉద్యోగాన్ని వదులుకొని కలబందని అమ్మి లక్షాధికారి కాదు ఏకంగా కోటీశ్వరుడు అయిపోయాడు. 120 ఎకరాల్లో కలబంద సాగుని మొదలుపెట్టవాడు.

సాంప్రదాయ పంటలకు బదులుగా ఔషధ మొక్కల్ని పండిస్తూ కోటీశ్వరుడు అయిపోయాడు. రెండు కోట్ల నుండి మూడు కోట్లకి వచ్చింది. నిజంగా ఇది ఎంతో గొప్ప విషయం కదా.. కొంతమంది సక్సెస్ ని చూస్తే వారిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా అదే అడుగుజాడల్లో నడిస్తే బాగుంటుందనిపిస్తుంది. జయసల్మర్ జిల్లాలోనే నేచురల్ ఆగ్రో కంపెనీని మొదలు పెట్టాడు. 80 వేల కలబంద మొక్కలతో వ్యవసాయాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు లక్షల్లో కలబంద మొక్కల్ని నాటి కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ సక్సెస్ ని ఆదర్శంగా తీసుకుంటే ప్రతీ ఒక్కరు కూడా సక్సెస్ అందుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news