ఆ సినిమాలకు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న ఎన్టీఆర్..!

-

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలను లిఖించుకున్న వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్. విభిన్నమైన పాత్రలను పోషించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ విజయాన్ని అందుకున్న సీనియర్ ఎన్టీఆర్.. పోషించని పాత్ర లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

 

ఎన్టీఆర్ నట వారసులుగా ఆయన తనయుడు బాలయ్య ప్రస్తుతం సినిమా రంగంతో పాటు పాలిటిక్స్ లోనూ ఉన్నారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. ఎన్టీఆర్ ఆ రోజుల్లో ఈ రెండు సినిమాలకు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారు. అవేంటో ఇవాళ తెలుసుకుందాం.

పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాలు దాదాపు మూడొందలకు పైగా చేసిన సీనియర్ ఎన్టీఆర్..క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. ఇక అప్పట్లో ఆయన ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేశారు. ఆయన సినిమాలు విడుదలయితే జనాలు హ్యాపీగా థియేటర్లకు వెళ్లి సినిమాను వీక్షించేవారు. ఆయన హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ‘అడవి రాముడు’ చిత్రానికి తీసుకున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు ఈ ఫిల్మ్ లో నటించినందుకు సీనియర్ ఎన్టీఆర్ రూ.36 లక్షలు తీసుకున్నారని సమాచారం.

అలా అప్పట్లోనే ఎన్టీఆర్ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకోవడం ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇక రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన చేసిన సినిమా ‘మేజర్ చంద్రకాంత్’ తోనూ రికార్డు క్రియేట్ చేశారు. ఇందులో నటించినందుకు సీనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు తీసుకున్నారని టాక్. ఈ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత.. ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన సంగతి అందరికీ విదితమే. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ ను మోహన్ బాబు ప్రొడ్యూస్ చేశారు. అలా ఈ రెండు సినిమాలు ‘అడవి రాముడు’, ‘మేజర్ చంద్రకాంత్’లకు సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news