‘దేవర’ మూవిలో అల్లూ అర్హ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా.?

-

ఏ రంగంలో అయినా నెపోటిజం కామన్‌గానే ఉంటుంది. కుటుంబం పెద్దవారు ఏ రంగంలో అయితే వృద్ధి సాదిస్తారో ఆ రంగంలో వారి వారసులకు, బంధువులకు ఎంట్రీ తేలిక అవుతుంది. ఇది మనం ఎక్కువగా రాజకీయాల్లో, సినీ రంగంలో చూస్తుంటాం. ఇక విషయానికి వస్తే.. అల్లూ అర్జున్‌ కూతురు అల్లూ అర్హ గురించి మీకు బానే తెలిసి ఉంటుంది. చిన్నప్పటి నుంచే అల్లూ అర్జున్‌ తన కుమార్తెతో కలిసి చేసిన క్యూట్‌ క్యూట్‌ వీడియోస్‌ తెగ వైరల్‌ అయ్యేవి. ఈ మధ్యనే శాకుంతలం మూవీలో అల్లూ అర్హ బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టింది. అర్హ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ntr devara

ఈ మూవీలో ఆమె తీసుకుబోతున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జనాలు షాక్‌ అవుతున్నారు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డిల ముద్దుల తనయ అల్లు అర్హకు ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. ఇప్పటికే స్టార్‌కిడ్‌గా సోషల్‌ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర’ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వికపూర్ ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్హను హీరోయిన్ జాన్వీకపూర్ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ విషయం గురించి స్వయంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్‌కి ఫోన్ చేసి మరి అడిగారట. దాంతో బన్నీ కూడా అంగీకరించినట్టు సమాచారం.

అల్లు అర్హ తన రెండవ సినిమాకే భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటునట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అర్హ నిమిషానికి 2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ఇక ఈ మూవీలో అర్హ పాత్ర 10 నిమిషాలు ఉంటుందట, ఆ లెక్కన చూస్తే సుమారు అల్లు అర్హ ఇరవై లక్షల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఐకాన్‌ స్టార్‌ కూతురు అంటే మినిమమ్‌ ఉంటుందని కమెంట్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news