బెంగుళూరు లో రెండు రోజుల విపక్షాల సమావేశానికి కాసేపటి క్రితమే తెరపడింది. ఈ మీటింగ్ లో నిన్నటి వరకు UPA గా ఉన్న కూటమి పేరును INDIA గా మార్చారు. ఈ మీటింగ్ అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ మా ఈ విపక్ష పార్టీలు అనీ కలిసి మోదీ పాలనను గద్దె దించడానికి చేసే పోరాటమే అన్నారు. మేము చేస్తున్న ఈ పోరాటం విపక్షము వెర్సస్ బీజేపీ కాదని.. INDIA వెర్సస్ NDA అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ దేశం బాగుపడాలంటే
INDIA కూటమి పాలనలోకి రావాలని రాహుల్ ఆశించారు. అతి త్వరలోనే INDIA పూర్తి కార్యాచరణను తెలియచేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. INDIA కూటమి దేశ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్య్రం కోసం యుద్ధం చేస్తుందని ధీమాను వ్యక్తం చేశారు రాహుల్. మోదీ నాయకత్వంలోని బీజేపీ దేశాన్ని ఆక్రమించుకుంటూ పాలనను సాగిస్తోందని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ.
అందుకే ఇకపై మోదీ అగాధాల్ని చూస్తూ INDIA ఊరుకోదని తెలిపారు. ఈ దేశప్రజలకు చాలా బాగా తెలుసు INDIA తో పోటీకి వస్తే ఎవరు గెలుస్తారో ?