అల్లు అరవింద్ కుమారుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

అల్లు అరవింద్ కొడుకులు అనగానే ముందుగా అల్లు అర్జున్ , అల్లు శిరీష్ లు మాత్రమే గుర్తుకు వస్తారు. ఎందుకంటే వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో తన ఇమేజ్ ను ఉపయోగించుకొని ప్రస్తుతం తమ కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. అయితే వీరిద్దరి కంటే ముందు అల్లు బాబి ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక అల్లు బాబీ అసలు పేరు అల్లు వెంకటేష్. అల్లు అరవింద్ మొదటి కుమారుడు ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమాతో నిర్మాతగా మారాడు. దాంతో అల్లు అరవింద్ పెద్ద కొడుకుగా అందరికీ పరిచయం అయ్యాడు. అల్లు వెంకటేష్ కు కొండంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ ఐటీ మీడియా రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు అని చెప్పవచ్చు.

గీత ఆర్ట్స్ సినీ నిర్మాణంలో కూడా తెర వెనుక తన పాత్ర సమర్థవంతంగా పోషించడం గమనార్హం . లండన్, ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసి టెక్నాలజీ ఇంటర్ ప్రీటర్ గా తన కెరియర్ మొదలుపెట్టారు. దాదాపు అదే రంగంలో 15 సంవత్సరాల పాటు ఉండి ఎన్నో సరికొత్త ఆలోచనలకు తెరతీశారు అల్లు వెంకటేష్. ఇక ఈ క్రమంలోనే ఎన్విరాన్మెంట్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లాంటి ఎన్నో సరికొత్త ఆలోచనలతో ఒకటిన్నర సంవత్సరం పాటు ఐటీ రంగంలో తన వంతు కృషి చేయడం జరిగింది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం తరఫున కూడా ఆన్లైన్ టికెట్ ను రూపకల్పన చేసే బాధ్యతలు కూడా ఈయనే తీసుకోవడం గమనార్హం.

తెలుగువారి తొలి ఓ టీ టీ ఆహా కోసం టెక్నాలజీ పరంగా ఎన్నో మెలకువలు అందించడం జరిగింది. అలాగే ప్రొడక్ట్ స్ట్రేటర్జీ విషయంలో కూడా ప్రేక్షకుల్లోకి విజయవంతంగా అది రావడానికి రోడ్మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు సినిమా రంగంలో గత 15 సంవత్సరాలుగా ఎన్నో విజయాలను అందుకున్న అప్పటికి ఇటీవలే తన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.