గంగోత్రి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

-

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటీమణులు సైతం మొదటి సినిమాతోనే స్టార్టమ్ సంపాదించాలంటే కాస్త అదృష్టం కూడా ఉండాలి. అయితే అలా అందుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలా అందుకొని వెండితెర పైన పెను సంచలనం సృష్టించి ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో అతిధి అగర్వాల్ కూడా ఒకరు. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ చిత్రం 2003 బాక్సాఫీస్ వద్ద పెను సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కే రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఇందులోని పాటలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన అతిథి అగర్వాల్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలు ఈమె. ఒకవైపు తన అక్క ఆర్తి అగర్వాల్ వరుస సినిమాలతో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో.. అతిధి అగర్వాల్ హీరోయిన్గా అడుగు పెట్టింది. అయితే స్టార్డమ్ అయితే అందుకోలేకపోయింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే దూరమైంది..2016 లో చివరిగా లవ్ హాయ్ యార్ ఆక్సెప్ట్ ఇట్ అనే సినిమాలో నటించినది.

అయితే ఇప్పటికి కూడా ఈమెకి ఇంకా వివాహం కాలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ అప్పుడప్పుడు తన అక్క ఆర్తి అగర్వాల్ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కలవడం జరిగింది. అల్లు అర్జున్ న్యూయార్క్ వెకేషన్ లో భాగంగా తనతో నటించిన మొదటి హీరోయిన్ ను అతిథి అగర్వాల్ ను కలుసుకోవడం జరిగింది. వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది అతిధి అగర్వాల్. ప్రస్తుతం ఈమె కుటుంబంతో కలిసి విదేశాలలోని స్థిరపడినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news