సినిమాల్లోకి రాకముందు వెన్నెల కిషోర్ ఏం చేసేవాడంటే?

-

వెన్నెల కిషోర్ పేరు చెప్తే..చాలు నవ్వు అలా వచ్చేస్తుంటుంది. టాలీవుడ్ పాపులర్ కమెడియన్ గా కొనసాగుతున్న వెన్నెల కిషోర్..వెరైటీ కామెడీ చేస్తూ..తన ముఖ కవళికలు, హావభావాలతో జనాలను కడుపుబ్బ నవ్వించేస్తున్నాడు. ఇటీవల విడుదలైన F3 ఫిల్మ్ లో పిచ్చోడిలాగా, పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ అంటూ డైలాగ్ లు చెప్పి నవ్వులు పూయించాడు.

టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించిన వెన్నెల కిశోర్..ఇండస్ట్రీకి ‘వెన్నెల’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో కిషోర్ చేసిన కామెడీ జనాలకు బాగా నచ్చింది. అలా కిశోర్ పేరు ‘వెన్నెల’ కిషోర్ అయిపోయింది.

వెన్నెల కిషోర్ తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. వెన్నెల కిషోర్ తండ్రి లక్ష్మీ నారాయణ ఇంగ్లిష్ టీచర్. స్కూలింగ్ తర్వాత బీకాం పూర్తి చేసిన అమెరికాకు వెళ్లిన వెన్నెల కిషోర్..అగ్రరాజ్యంలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉండేవాడు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు. ‘వెన్నెల’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలనే ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నాడు. అలా దర్శకుడు దేవ కట్టాతో మాట్లాడి ఆయన టీమ్ లో జాయిన్ అయ్యాడు.

‘వెన్నెల’ సినిమాలో శివారెడ్డి చేయాల్సిన పాత్రను కిషోర్ చేశాడు. ఇక ఈ సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేయడం తన అదృష్టమని చెప్తున్నాడు వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ భార్య పేరు పద్మజ. ఈమె కూడా మైక్రోసాఫ్ట్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. వెన్నెల కిషోర్ ప్రజెంట్ టాలీవుడ్ బిజీ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news