వరుస ఫ్లాప్ లను మూటగట్టుకున్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించిన ఈమె ఈ సారి మాత్రం వరుసగా మూడు డిజాస్టర్ మూవీ లను మూటగట్టుకుంది. ఇకపోతే ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ సినిమాతో మొదటి డిజాస్టర్ ను అందుకున్న ఈమె.. ఆ తర్వాత విజయ్ హీరోగా వచ్చిన బీస్ట్ సినిమాతో కూడా పరాజయం చవిచూసింది. ఇక చిరంజీవి , రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య సినిమాతో కూడా ఫ్లాప్ ను కూడా చవిచూసింది అలా వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాపుల ను అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది అనే వార్తలు వచ్చాయి.
అంతేకాదు అధికారికంగా కూడా ఈ విషయాన్ని ప్రకటించి..ఆమెనే హీరోయిన్ గా ఫైనల్ చేశారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజాహెగ్డే.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు గల కారణం ఏమిటంటే ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఈ సినిమా కోసం కాల్ షీట్ ను అడ్జస్ట్ చేయలేకపోతోంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడే కాల్ షీట్లు ఇచ్చేస్తే మరి టాలీవుడ్ , బాలీవుడ్ సినిమాలకు ఇబ్బంది అవుతుంది. అందుకే నో చెప్పినట్లు సమాచారం.
మరొక కారణం కూడా లేకపోలేదు.. ఎప్పుడో షూటింగ్ మొదలు కాబోయే ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే డేట్లు అడ్జస్ట్ చేయడం అంటే అతి కష్టమైన పని. అందుకే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయడానికి ఈమె ఆ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ తో నటించే అవకాశాన్ని కోల్పోయింది పూజాహెగ్డే అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.