వకీల్ సాబ్ కి కీలకంగా మారిందెవరో తెలుసా ..?

-

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శృతిహాసన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తుండగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తుండగా ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా రూపొందిస్తున్నారు. కోలీవుడ్ లోను ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

 

వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఒక సాంగ్ కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలన్ని కలిపి ఒక నెల వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. జూలై నుండి ప్రమోషన్స్ ని మొదలు పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

అయితే ఇప్పుడు అందరూ ఈ సినిమా కి సంబంధించిన ఒక విషయం లో ఆసక్తికరమైన చర్చ జరుపుతున్నారట. అదే థమన్ అందిస్తున్న మ్యూజిక్. ఈ సినిమాకి మొదటిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తున్నాడు థమన్. ఇప్పటికే వకీల్ సాబ్ నుంచి మగువా సాంగ్ రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాని ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేదని మాత్రం టాక్ ఉంది. అంతేకాదు ఇప్పుడు అందరూ అల వైకుంఠపురములో వంటి ఆల్బం కావాలని థమన్ ని ఒత్తిడి చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ పెద్ద హిట్ గా నిలిచింది. అది దేవీశ్రీ ప్రసాద్ అయినా మణిశర్మ అయినా. కాని ఆ స్థాయిలో థమన్ మ్యూజిక్ ఉండక పోతే వకీల్ సాబ్ కి కాస్త మైనస్ అవుతుందన్న టాక్ నడుస్తోంది. మరి వకీల్ సాబ్ కి ఇంత కీలకంగా మారిన థమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news