శ్రీదేవి కూతురి టాలీవుడ్ ఎంట్రీ.. ఎలా మిస్సయిందో మీకు తెలుసా?

-

అతి లోక సుందరి శ్రీదేవికి తెలుగు నాట ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. శ్రీ దేవి నటించిన సినిమాలన్నీ దాదాపుగా తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆమె మరణానంతరం ఆమె నటవారసురాలిగా జాన్వీకపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్నది.ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ తెలుగులోకి రాబోతున్నదని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి.

‘జగదేక వీరుడు అతి లోక సుందరి పార్ట్-2’లో రామ్ చరణ్, జాన్వీకపూర్ హీరోహీరోయిన్లుగా నటించాలని ఓ ఇంటర్వ్యలో మెగా స్టార్ చిరంజీవి చెప్పారు. కానీ, ఆ దిశగా అడుగులు అయితే అడుగులు పడలేదు. అయితే, తాను ‘జగదేక వీరుడు అతి లోక సుందరి పార్ట్-2’ గురించి ఆలోచిస్తున్నానని నిర్మాత అశ్వనీదత్ అంటున్నారు. ఇకపోతే ‘లైగర్’ సినిమా ద్వారా జాన్వీకపూర్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేది. కానీ, మిస్ అయిపోయిందన్న సంగతి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెలిపారు.

పాన్ ఇండియా వైడ్ గా ఈ నెల 25న విడుదల కానున్న ‘లైగర్’లో హీరోయిన్ గా తొలుత జాన్వీకపూర్ ను అనుకున్నట్లు దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పారు. పూరీ కనెక్ట్స్ తో కలిసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. శ్రీదేవికి తాను వీరాభిమానినని, ఈ క్రమంలోనే ‘లైగర్’లో జాన్వీకపూర్ ను తీసుకుందామనుకున్నామని తెలిపారు. అయితే, జాన్వీ కపూర్ డేట్స్ అందుబాటులో లేకపోవడం వలన ఆ అవకాశం అనన్యా పాండేకు వెళ్లిందని వివరించారు.

హీరోయన్ గా అనన్యా పాండేను కరణ్ జోహార్ సజెస్ట్ చేసినట్లు తెలిపారు. తాను పదేళ్ల కిందటే ‘లైగర్’ ఫిల్మ్ స్టోరి రాసుకున్నానని, విజయ్ దేవరకొండకు ఈ స్టోరితో పాటు మరొక స్టోరి వినిపించగా, విజయ్ దేవరకొండ ‘లైగర్’ చేద్దామన్నాడని వివరించాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ నటన చూసి నార్త్ ఇండియా ఫిదా అయిందని, అప్ప టి నుంచే ఉత్తర భారతదేశంలో విజయ్ అంటే ప్రేమ ఉందని వివరించారు. ఇక ‘లైగర్’లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణతో పాటు బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news