అఖిల్ తో సినిమా చేయడం నా కర్మ – ఏజెంట్ నిర్మాత..!

-

ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా మిగిలిన చిత్రాలలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ చిత్రం కూడా ఒకటి. సుమారుగా రూ.80 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ఫుల్ మూవీ సరికి కేవలం రూ .7కోట్లు మాత్రమే షేర్ వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాని టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించడం జరిగింది ఇకపోతే ఈ చిత్ర నిర్మాత అయిన రామ్ అచంటా కి తన కెరియర్ లో ఇలాంటి నష్టాలను కలిగించిన సినిమాలు ఇప్పటివరకు రాలేదు అని.. ఇక తన పని అయిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఆయన నిర్మాణంలో విడుదలైన తాజా చిత్రం సామజవరగమన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు రాబట్టింది.

ఇక ఈ నేపథ్యంలోనే సక్సెస్ మీట్ నిర్వహించగా అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం నేను నిర్మించిన ఏజెంట్ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచి ఘోరమైన నష్టాలను తెచ్చి పెట్టింది. ఇక నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద పొరపాటు ఈ సినిమా చేయడమే. ఈ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి అందరూ నా పని అయిపోయింది అనుకున్నారు. సినిమా చేయడం నా కర్మ అనిపించింది..

కానీ ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాతలు హీరోలు అందరూ నాకు అండగా నిలబడి ఫోన్లు చేసి మరి నిరాశ చెందవద్దని.. కచ్చితంగా రాబోయే రోజుల్లో బ్లాక్ బస్టర్ కొడతారని సపోర్ట్ చేసారు. అయితే వారందరి ఆశీర్వాదం వల్లే ఇప్పుడు మళ్లీ ఈ సినిమాతో మంచి కలెక్షన్స్ పొందగలుగుతున్నాను అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news