వాలంటీర్స్ లో ఒక్కరినైన పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేపించగలిగితే తణుకు సెంటర్లో ఊరి వేసుకుంటానంటూ సవాల్ చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. నిన్న ఏపీ సర్కార్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. వాలంటీర్స్ డబ్బుల కోసం పని చేసే వ్యక్తులు కాదు.. మంచి జాబ్ వచ్చినవారు వాలంటీర్స్ వెళ్లిపోతున్నారన్నారు.
చెత్త ట్యాక్స్ గురించి పవన్ కళ్యాణ్ మోడీని అడిగితే బాగుంటుంది.. చెత్త ప్రభుత్వం అని తిడితే మోడీ ప్రభుత్వాన్ని తిట్టినట్టేనని ఆగ్రహించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పవన్ కళ్యాణ్ తణుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడి వెళ్ళారని.. ఏడాదికి వెయ్యి కోట్లు వస్తాయి అంటున్నారని ఆగ్రహించారు. రెండు సినిమాలు చేస్తే వెయ్యి కోట్లు ఎలా వస్తాయి..వెయ్యి కోట్లు సంపాదించే మీరు 21 కోట్లు ట్యాక్స్ మాత్రమే ఎందుకు కడుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్ర బాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తున్నారని పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. TDR బాండ్ల లో 309 కోట్లు అవినీతి అంటున్నారు.. ఈ స్కాం లో ఏ పార్టీ వాళ్ళు వున్నారు అనేది చూడాలన్నారు.