రివ్యూ : కార్తీ “దొంగ ” అయ్యో కార్తీ

-

ఇంట్రడక్షన్ :- తమిళ సినిమా రంగానికి చెందిన హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. సూర్య తమ్ముడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన కార్తీ తక్కువ కాలంలోనే తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకుని వైవిధ్యమైన సినిమాలు మరియు క్యారెక్టర్లు ఎంచుకుని అటు తమిళంలో మరియు తెలుగులో కూడా సినిమాలు రిలీజ్ చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీ తాజాగా ‘దొంగ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

కథ : 15 సంవత్సరాల క్రితం ఇంట్లోంచి పారిపోయిన తమ్ముడు మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది ? ఆ అక్క , ఆ ఫామిలీ యొక్క రియాక్షన్స్ ఏంటి ? వచ్చిన వాడు నిజంగా తన తమ్ముడా కాదా అని అనుమానపడే అక్క .. అసలు వచ్కిన వాడు ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నాడు .. వాడు తన తమ్ముడు కాకపోతే ఇంకెవడు .. ఇలాంటి ఆలోచనల సారాంశం కథగా చేసుకున్నాడు ‘ దొంగ ‘ సినిమా డైరెక్టర్.

సినిమా విశ్లేషణ:-తమిళంలో ‘తంబి’ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘దొంగ’ టైటిల్ తో రిలీజ్ అయింది. అయితే సినిమాకి సంబంధించి ఫస్టాఫ్ మొత్తం దారుణంగా ఉండటం తోనే బోరింగ్ గా ఉంది. అయితే సెకండాఫ్ కి వచ్చేసరికి సినిమా ట్విస్టుల తో సినిమా డైరెక్టర్ దృశ్యం ఫేం జీతూ జోసెఫ్ అద్భుతంగా తెరకెక్కించాడు. అయినాగానీ సినిమా మొదటి నుండి బోరింగ్ గా ఉండటంతో ఆడియన్స్ సినిమాకి సరిగ్గా కనెక్ట్ అవ్వలేక పోయారు. సినిమా మొత్తానికి సత్యరాజ్ పాత్ర హైలెట్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ లో సినిమాకి చాలా ప్లస్ అయినా గాని ప్రేక్షకులు దొంగ సినిమా యావరేజ్ అని అంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే కార్తీ ఖైదీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చేయాల్సిన సినిమా కాదని దొంగ గురించి తెలుగు ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

సినిమా ప్లస్ పాయింట్స్:-
-కార్తీ నటన
-సెకండాఫ్
-సత్య రాజ్ క్యారెక్టర్

సినిమా మైనస్ పాయింట్స్:-
-ఫస్టాఫ్.
-స్టోరీ.

ఓవరాల్ గా:-
సినిమా ఫస్ట్ హాఫ్ దారుణంగా ఉండటంతో సెకండాఫ్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేని ప్రేక్షకులకు డైరెక్టర్ జీతూ జోసెఫ్ సినిమాని అనేక ట్విస్ట్‌లతో కొద్దోగొప్పో నడిపించిన గాని దొంగ సినిమాకి ప్రేక్షకులను స్టొరీ తో కనెక్ట్ చేయలేకపోయాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ప్లాప్ అని టాక్ ప్రస్తుతం నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news