రాజకీయాలను పక్కన పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న జగన్ చేసిన ప్రకటన గురించి ఒక్కసారి చూద్దాం… ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన హైదరాబాద్ నెత్తిన పాలు పోసేసారు… అది ఏంటి ఎలా అనేది ఈ స్టొరీలో చూద్దాం… వాస్తవానికి రాష్ట్రాలకు రాజధాని అనేది చాలా కీలకం… రాష్ట్రం గాడిలో పడినప్పుడు మూడు కాదు ముప్పై పెట్టుకున్నా ఇబ్బ౦ది లేదు. ఇప్పుడు పరిపాలన అంతా ఒక చోట నుంచి జరగాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ కి ఉంది… అభివృద్ధి విస్తరణ జరగాలి…
జగన్ చేసిన ప్రకటన అనేది భవిష్యత్తుని ఆలోచించి మంచా చెడా అనేది పక్కన పెడితే… ఇప్పుడు మాత్రం అది మంచిది కాదు… ఎందుకంటే… రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆహ్వానించాల్సిన తరుణం ఇది. పెట్టుబడులు పెట్టె వాళ్లకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరించాలి… విజయవాడ ఆర్ధిక రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. విశాఖ అనేది గత అయిదేళ్ళలో ఎక్కువగా అభివృద్ధి చెందింది. విజయవాడకు దగ్గరగా హైదరాబాద్ కూడా ఉంది. గుంటూరు నగరం అతి సమీపంలో ఉంది కాబట్టి… పెట్టుబడులు త్వరగా వచ్చే అవకాశం ఉంది.
చిన్న చిన్న కంపెనీలు… అంటే తక్కువ పెట్టుబడితో వెంటనే శాఖలను మొదలుపెట్టేవి ఇలాంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి చూస్తాయి. కాని జగన్ ప్రకటనతో వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ గుమ్మం తొక్కుతున్నారు… రాష్ట్రం ఒక గాడిన పడిన తర్వాత విభజించాలి అనే ఆలోచన మంచిదే. ఇప్పుడు జగన్ పుణ్యమా అని హైదరాబాద్ లో తగ్గిన భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న స్థలాలు కొనే వాళ్ళు కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నారు.
మరో మూడు నెలల్లో ఆర్ధిక ఏడాది మొదలవుతుంది. వ్యాపారవేత్తలకు ఆర్ధిక వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడి హైదరాబాద్ లో భూములు కొనుగోలు చేస్తే మంచిది అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ఆలోచనతో ఆంధ్రాలో భూముల ధరలు భారీగా తగ్గుతున్నాయి. అవి పెరిగే అవకాశం కూడా ఇప్పట్లో పెద్దగా కనపడటం లేదు. కాబట్టి… హైదరాబాద్ వైపు చూసే వాళ్ళ సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.