నేను చిన్న ‘దొరసాని’ని ప్రేమిస్తానురా? టీజర్ నాచురల్ గా ఉంది..!

-

అచ్చం తెలంగాణ యాసతో.. ఊరు బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా దొరసాని. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ సినిమాకు హీరో. ఆయన డెబ్యూ మూవీ ఇది.

చిన్న దొరసాని గడిలో నుంచి బయటికే రాదు. వీనికేంతెల్వద్. పీకద్.. దొరసానులెప్పుడైనా బయటికొత్తారురా? నేను చిన్న దొరసానిని ప్రేమిస్తానురా? అంటే దొరసాని కూడా నన్ను చూత్తాంది. దొరసానిని ప్రేమిత్తాండా? ఎవల్కన్నా చెప్పేవ్.. నిజమే అనుకుంటరు.. నీ పేరు.. రాజు. మీరు దొరసాని. కాదు.. దేవకి. కాదు మీరు నా దొరసాని.. అంటూ సాగుతుంది దొరసాని టీజర్.

అచ్చం తెలంగాణ యాసతో.. ఊరు బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా దొరసాని. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ సినిమాకు హీరో. ఆయన డెబ్యూ మూవీ ఇది. ఇక.. దొరసానిగా యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కూతురు శివాత్మిక నటిస్తోంది. ఆమెకు కూడా ఇదే డెబ్యూ మూవీ. ఇదివరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

తెలంగాణలో ఒకప్పుడు దొరల పాలన ఉండేది. భూస్వాముల పాలన ఉండేది. దాన్ని నేపథ్యంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టీజర్ చూస్తే కూడా దొరల పాలన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర శ్రీధర్, యష్ రంగినేని ఈసినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా… కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version