టీటీడీ బోర్డు చైర్మన్ గా ఎవరు ఉంటారు.. జగన్.. ఎవరిని నియమిస్తారు అనేదానిపై చాలారోజుల నుంచి చర్చ సాగుతోంది. ఈనేపథ్యంలో ప్రముఖ నటుడు, వైఎస్సార్సీపీ నేత మోహన్ బాబును టీటీడీ చైర్మన్ గా జగన్ నియమించనున్నట్లు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. అయితే.. ఆయన రాజీనామా చేయలేదు. రాజీనామా చేసే యోచనలో కూడా సుధాకర్ యాదవ్ లేరు. దీంతో బోర్డును రద్దు చేసే యోచనలో ఏపీ సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. టీటీడీ బోర్డును రద్దు చేసి కొత్త పాలకమండలిని నియమించాలన్నది జగన్ ప్లాన్.
అయితే.. టీటీడీ బోర్డు చైర్మన్ గా ఎవరు ఉంటారు.. జగన్.. ఎవరిని నియమిస్తారు అనేదానిపై చాలారోజుల నుంచి చర్చ సాగుతోంది. ఈనేపథ్యంలో ప్రముఖ నటుడు, వైఎస్సార్సీపీ నేత మోహన్ బాబును టీటీడీ చైర్మన్ గా జగన్ నియమించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలపై మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పదవీ ఆశించడం లేదని.. తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని మీడియాను కోరారు.
అయితే.. జగన్ మాత్రం టీటీడీ చైర్మన్ పదవిని తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అప్పగించాలని అనుకుంటున్నారట. వైవీ సుబ్బారెడ్డి 2014 లో ఒంగోలు ఎంపీగా గెలిచారు. తర్వాత ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలంతా రాజీనామా చేసినప్పుడు వైవీ సుబ్బారెడ్డి కూడా రాజీనామా చేశారు. తర్వాత 2019లో మాత్రం సుబ్బారెడ్డికి జగన్ టికెట్ ఇవ్వలేదు. దీంతో తనను రాజ్య సభకు పంపుతానని జగన్ హామీ ఇచ్చారట. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా తన బాబాయిని నియమిస్తే బెటర్ అని జగన్ అనుకుంటున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం వెలువడలేదు.