సుశాంత్ సింగ్ మరణం తర్వాత రియాచక్రవర్తిపై వచ్చిన ఆరోపణల నడుమ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి మాదక ద్రవ్యాల సరఫరా మొదలగు విషయాలపై రియాని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రియా, తన సోదరుడు సహా ఇంకా నలుగురు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఐతే ఈ విషయంలో నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో డ్రగ్స్ కేసులో వేగవంతం చేసింది. రియా బయటపెట్టిన పేర్లలో చాలామంది బాలీవుడ్ సెలెబ్రిటీలు ఉన్నారు.
ఈ విషయమై నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో జరిపిన మీటింగ్ లో ముందుగా 25మంది బాలీవుడ్ జనాలకి సమన్లు పంపించనున్నారట. ఆ 25మంది ఎవరనేది బయటకి వెల్లడి కాలేదు. రియా చక్రవర్తి చెప్పిన లిస్టులో చాలా మందిపేర్లున్నాయట. వారందరికీ సమన్లు వెళ్ళనున్నాయని, వారందరూ నార్కోటిక్స్ బ్యూరో ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని సమాచారం. ఐతే బాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలు డ్రగ్స్ తీసుకోవడమే కాదు వాటిని సరఫరా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారట.