టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా !

-

తెలంగాణ ఈసెట్ ఫలితాలను హైదరాబాద్ కూకట్ పల్లి జేఎన్టీయూలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 97.58 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. గత నెల 31వ తేదీన జరిగిన ఈ పరీక్షకు 28,041 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 25,440 మంది పరీక్ష రాశారు. తెలంగాణలో 14, ఏపీలో 4 చోట్ల నిర్ణయించిన పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.

కరోనా పరిస్థితుల అనంతరం నిర్వహించిన తొలి పరీక్ష ఇదేనని చెప్పచ్చు. వీరిలో 24,832 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో మహిళలు ప్రథమ స్థానంలో నిలిచారు. అడ్మిషన్ ప్రాసెస్ కు సంబంధించిన వివరాలు ఈ నెల 16 వ తేదీన వివరాలను నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తామని పాపి రెడ్డి తెలిపారు. టీఎస్‌ఈసెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసు కోవాలని చెబుతున్నారు.
https://ecet.tsche.ac.in/TSECET/TSECET_GetRankCard.aspx

Read more RELATED
Recommended to you

Latest news