దసరా స్పెషల్: ఈవారం ఓటీటి థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!!

-

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే పండగ వాతావరణం మొదలవుతోంది. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు నుంచి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా ప్రారంభమవుతున్నాయి. మరొకవైపు పిల్లలకు స్కూలు సెలవులు ఇవ్వడంతో ఈ దసరా పండుగను చాలా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే సినిమాలు ఎక్కువ చూసే వాళ్లకు మాత్రం ఈ పండుగ మరింత సందడి తీసుకురానుంది.. ఈవారం థియేటర్లలో ఓటీటి లో ప్రసారం అయ్యేందుకు పలు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1). థియేటర్:

1). నేనే వస్తున్నా: తమిళ హీరో ధనుష్ ఇటి వలె వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధాన పాత్రను నటిస్తున్న చిత్రం నేనే వస్తున్నా. ఇందులో ఇలి ఆవ్రామ్,హిందూజా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. విచిత్రాన్ని శ్రీ రాఘవన్ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతోంది.

2). పోన్నియన్ సెల్వన్: డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇందులో ఐశ్వర్యరాయ్, కార్తీ, జయంరవి,కార్తీ, త్రిష తదితరులు నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఈనెల 30న విడుదల కాబోతోంది.

3). విక్రమ్ వేద: బాలీవుడ్ హీరో రుతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రం పైన భారీగా అంచనాలు ఉన్నాయి. ఇందులో రాధిక ఆప్టే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

OTT:
1). అమెజాన్ ప్రైమ్ :777 చార్లీ -సెప్టెంబర్ 30
2). సోనీ లీవ్:కోబ్రా-సెప్టెంబర్ -28
3). Zee -5:బుల్లెట్ ట్రైన్-సెప్టెంబర్ -29
4) zee -5: కెప్టెన్-సెప్టెంబర్-30
5) నెట్ ఫ్లిక్స్: బ్లోండి -28
6). నెట్ ఫ్లిక్స్:ప్లాన్ ఏ ప్లాన్ బి-సెప్టెంబర్ 30.

Read more RELATED
Recommended to you

Latest news